మీ డెస్క్టాప్ పైన ఉండే Recycle Bin ని ప్రతిరోజు చూసి చూసి బోర్ ఫీల్ అవుతున్నారా!
అయితే ఇపుడు మీ డెస్క్టాప్ పైన Recycle Bin ని తాత్కాలికంగా కనిపించకుండా చేయవచ్చు..
అది ఏలానో తెలుసుకోవాలనుకుంటున్నారా..
ఈ క్రింది విధంగా చేయండి..
Note: ఈ క్రింది Images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
Step 1: మీ డెస్క్టాప్ పైన రైట్ క్లిక్ చేయండి.
Step 2: వచ్చిన మెను లో Personalize ని క్లిక్ చేయండి.
Step 3: ఇపుడు Change desktop icons ని ప్రెస్ చేయండి.
Step 4: ఇపుడు మీరు పై భాగంలో Recycle Bin ని చూస్తారు.
Step 5: ఈ Recycle Bin కు ప్రక్కన ఉండే టిక్ ను తొలగించండి (అంటే ఆ టిక్ పైన క్లిక్ చేస్తే టిక్ పోతుంది..ఖాళీ బాక్స్ కనిపిస్తుంది).
Step 6: ఇపుడు మీరు క్రింద ఉన్న Apply ని క్లిక్ చేయండి.
Step 7: తర్వాత Ok ని క్లిక్ చేయండి.
Recycle Bin ని తిరిగి మీ డెస్క్టాప్ పైకి తీసుకురావడానికి మళ్ళీ మీరు పై స్టెప్స్ కి వెళ్ళి Recycle Bin ని టిక్ చేసి Apply & Ok చేయండి.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.