చాలా సులభంగా మీ డెస్క్టాప్ పైన వున్న అన్ని ఆప్స్,పోల్డర్స్ లేదా ఇతర....అన్నింటిని మాయం అనగా కనపడకుండా (Invisible) చేయవచ్చు.
ఎలాగా అనుకుంటున్నారా? ఈ క్రింది స్టెప్స్ ని ఫాలో అవండి. (Windows 7)
Note: ఈ క్రింది Images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
Step 1: మీ డెస్క్టాప్ పైన రైట్క్లిక్ చేయండి.
Step 2: తర్వాత వచ్చిన మెను లో View ని క్లిక్ చేయండి.
Step 3: ఇపుడు show desktop icons కు వున్న టిక్ ను తొలగించండి (దానిపైన క్లిక్ చేస్తే టిక్ పోతుంది)
Finish: అంతే! మీ డెస్క్టాప్ పైన వున్న అన్ని ఆప్స్,పోల్డర్స్ Invisible అవుతాయి.
ఇపుడు వాటిని తిరిగి తీసుకురావడానికి (Visible) మళ్ళీ
Step 1: డెస్క్టాప్ పైన రైట్క్లిక్ చేయండి.
Step 2: తర్వాత వచ్చిన మెను లో View ని క్లిక్ చేయండి.
Step 3: ఇపుడు Show desktop icons పైన క్లిక్ చేయండి(టిక్ వస్తుంది).
Finish: అంతే తిరిగి మళ్ళీ మీ ఆప్స్ ని పొందుతారు.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.