మనం కంప్యూటర్ లో తెలుగు లో టైప్ చేయాలంటే మనం చాలా రకాల సాప్ట్వేర్ లను ఉపయోగిస్తుంటాం.అలా కాకుండా చాలా సులువుగా మరియు వేగవంతంగా తెలుగులో టైప్ చేసుకోవచ్చు.
అది ఎలానో తెలుసుకోవలనుకుంటున్నారా?
Note: ఈ క్రింది Images పెద్దవిగా చూడడానికి వాటి పై క్లిక్ చేయండి.
Step 1: Lekhini.org అనే వెబ్సైట్ లోకి వెళ్ళండి.
మీకు ఈ విధంగా కనిపిస్తుంది.
Step 2: పైన బాక్స్ లో English లో రాయండి.
English అంటే English లో రాయడం కాదు.
క్రింది పదాలను చూడండి మీకు అర్ధమవుతుంది.
టెక్ ట్రిక్స్ = Tek Triks, వ = va, అద్భుతం = adbhutam, సులభం = sulabham.
Step 3: క్రింది బాక్స్ లో మీరు English లో రాసినదానికి మీకు తెలుగు లో కనిపిస్తుంది.
Step 4: ఈ తెలుగు టెక్స్ట్ ని కాఫి చేసుకుని మీకు కావలసిన చోట పేస్ట్ చేసుకోండి.
Ex:-Notepad,Ms word,Facebook...etc.
Finish : అంతే మీరు చాలా బాగా మరియు సులభంగా మీ కంప్యూటర్ లో తెలుగు వాడవచ్చు..
Note:1 మనం ఇలా తెలుగు లో టైప్ చేయడానికి ఇంటర్నెట్ కూడా అవసరం లేదు.పూర్తిగా ఆప్లైన్ లో టైప్ చేసుకోవచ్చు.
కాని ముందు ఈ Lekhini.org వెబ్సైట్ ఓపెన్ చేయడానికి మాత్రం ఇంటర్నెట్ కావాలి.
ఈ వెబ్సైట్ ఓపెన్ అయ్యాక మీ ఇంటర్నెట్ ను ఆఫ్ చేయండి.
Note:2 మీకు ఏమైన టైపింగ్ లో సందేహం కలిగితే ఆ వెబ్సైట్ లో ప్రక్కన ఉండే బాక్స్ ను చూడండి.
లేదా ఈ పోస్ట్ క్రింది భాగంలో ఉన్న కామెంట్ ద్వారా నాకు తెలియజేయగలరు.
ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి మరియు మీకు ఏమైనా సందేహాలు వుంటే కామెంట్స్ ద్వారా తెలియజేయగలరు.