మనం చాలా ఫోల్డర్స్ క్రియేట్ చేయడానికి చాలా శ్రమ పడుతుంటాము.
కాని ఇపుడు అటువంటి ఇబ్బంది ఏమి పడకుండా చాలా త్వరగా ఫోల్డర్స్ ని క్రియేట్ చేయవచ్చు.
ఈ క్రింది స్టెప్స్ ని ఫాలో అవండి.
Step 1: మీ కంప్యూటర్ (లేదా) లాప్టాప్ లో నోట్ఫాడ్ ఓపెన్ చేయండి.
Step 2: ఇపుడు మీరు క్యాపిటల్స్ లో MD అని టైప్ చేయండి.
Step 3: తర్వాత స్పేస్ ఇచ్చి మీరు క్రియేట్ చేద్దాం అనుకుంటున్న ఫోల్డర్స్ పేర్లను ఒక్కోక్క దానికి స్పేస్ ఇస్తూ వ్రాయండి.
*అంటే MD తర్వాత స్పేస్ ఇచ్చి మీరు క్రియెట్ చేద్దాం అనుకున్నా మొదటి ఫోల్డర్ పేరు రాయండి.
*తర్వాత స్పేస్ ఇచ్చి మీరు క్రియెట్ చేద్దాం అనుకున్నా రెండోవ ఫోల్డర్ పేరు రాయండి.
*తర్వాత స్పేస్ ఇచ్చి మూడవ ఫోల్డర్ పేరు రాయండి ss
*అలా మీరు ఎన్ని ఫోల్డర్స్ క్రియేట్ చేయాలనుకుంటే అన్ని రాయండి.
Step 4: తర్వాత సేవ్ చేయండి. అంటే Ctrl+S ని ప్రెస్ చేయండి.
Step 5: ఇపుడు మీరు దేంట్లో ఈ ఫోల్డర్స్ ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ డ్రైవ్ ని సెలక్ట్ చేసుకుని Name.bat అనే పేరుతో సేవ్ చేయండి.
*పైన మీరు Name కు బదులు ఏ పేరైన రాసుకోవచ్చు.కాని ఆ పేరు తర్వాత .bat అనే దానిని మాత్రం తప్పక రాయండి (ఇలా రాసే దానిని (.bat) ఎక్స్టెన్షన్ అంటారు).
Step 6: ఇపుడు మీరు దేంట్లో సేవ్ చేసారో దాన్ని ఓపెన్ చేస్తే మీకు Name అనే ఫైల్ కనిపిస్తుంది (మీరు ఏ పేరు రాస్తే ఆ పేరు గల ఫోల్డర్ కనిపిస్తుంది) .
Step 7: ఇపుడు మీరు ఆ ఫోల్డర్ ను డబుల్ క్లిక్ ద్వారా ఓపెన్ చేయండి.
Finish: అంతే మీ ఫోల్డర్స్ అన్ని ప్రత్యక్షమవు
ఇపుడు మీరు Name అనే ఫైల్ ను డిలీట్ చేయండి.